అత్యాచార యత్నం: ఇద్దరు యువకుల అరెస్ట్‌ | student kidnap: two men arrested in hyderabad | Sakshi
Sakshi News home page

అత్యాచార యత్నం: ఇద్దరు యువకుల అరెస్ట్‌

Jan 5 2017 7:20 PM | Updated on Nov 9 2018 5:02 PM

అత్యాచార యత్నం: ఇద్దరు యువకుల అరెస్ట్‌ - Sakshi

అత్యాచార యత్నం: ఇద్దరు యువకుల అరెస్ట్‌

అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్లో విద్యార్థినిని బుధవారం ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు.

హయత్నగర్(హైదరాబాద్‌ సిటీ): అబ్దుల్లాపూర్  మెట్ మండలం మజీద్ పూర్లో విద్యార్థినిని బుధవారం ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్దినిని, స్థానికంగా నివాసం ఉంటున్న పాలపాటి రమేష్, మండలి శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు  నిన్న(బుధవారం) సాయంత్రం  బలవంతంగా స్విఫ్ట్ కార్లో ఎక్కించి అత్యాచార యత్నం చేయబోయారు.
 
బాలిక కేకలు వేయడంతో, ఇద్దరినీ స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం  పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరాలు వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement