చేతుల్లోనే చివరి శ్వాస.. | Student death with Diarrheal disease in Lingampeta | Sakshi
Sakshi News home page

చేతుల్లోనే చివరి శ్వాస..

Aug 6 2016 2:11 AM | Updated on Nov 9 2018 4:36 PM

మూడు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు.. అందరూ చూస్తుండగానే చేతుల్లోనే...

అతిసారంతో విద్యార్థి మృతి
లింగంపేట: మూడు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు.. అందరూ చూస్తుండగానే చేతుల్లోనే ప్రాణాలొదిలాడు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సురాయిపల్లి తుల్జానాయక్ తండాకు చెందిన రమావత్ మహేశ్ (8) వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా డు. శుక్రవారం సాయంత్రం కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు వసురాం, సక్రీ 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు.

కానీ, ఆ వాహనం వచ్చేలోపే.. అందరూ చూస్తుండగానే వారి చేతుల్లోనే ఆ బాలుడు మృతి చెందాడు. తండాలో మరికొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హైదరాబాద్, కామారెడ్డి, లింగంపేటల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement