ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే...? | student cell phone robbery in himayat nagar | Sakshi
Sakshi News home page

ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే...?

Oct 20 2014 9:50 AM | Updated on Aug 25 2018 4:51 PM

ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే...? - Sakshi

ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే...?

ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే అంటూ ఓ దుండగుడు... విద్యార్థిని నుంచి ఇరవై వేల విలువైన సెల్ఫోన్తో ఉడాయించాడు.

హైదరాబాద్ : ఇది మా అబ్బాయి ఫోన్లా ఉందే అంటూ ఓ దుండగుడు... విద్యార్థిని నుంచి ఇరవై వేల విలువైన సెల్ఫోన్తో ఉడాయించాడు.  వివరాల్లోకి వెళితే హిమాయత్ నగర్లోని వాసవి స్కూల్లో చదువుతున్న తనిష్క్ (15) మోపెడ్కు స్టిక్కరింగ్ వేయించుకునేందుకు ఆదివారం సాయంత్రం కింగ్కోఠి వైపు వెళుతున్నాడు.  అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి... నీ చేతిలో ఉన్న సెల్ఫోన్ మా అబ్బాయి ఫోన్లా ఉందే అంటూ తనిష్క్ను ఆపాడు.

దాంతో ఆందోళనకు గురైన తనిష్క్ ....లేదు అంకుల్ ఇది నా ఫోనే అంటూ సమాధానమిచ్చాడు. దాంతో ఆగంతకుడు నువ్వు చెప్పేది నిజమే అయినా మా అబ్బాయి ఫోన్ ఈ మధ్యే ఎవరో ఎత్తుకెళ్లారు. ఒకసారి  నీ ఫోన్ చెక్ చేసుకొని వస్తాను....వేచి ఉండమని వెళ్లిపోయాడు. అతడు ఎంతకూ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. దాంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement