‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ | Spoken english training in Sakshi Edge | Sakshi
Sakshi News home page

‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ

May 3 2017 1:32 AM | Updated on Aug 20 2018 8:20 PM

‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ - Sakshi

‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ

ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి.

10 నుంచి ‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్‌: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ఆధ్వర్యంలోని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్‌’వినూత్నమైన శిక్షణను అందజేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్ఛారణలో దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ లింకింగ్‌ అధిగమించడం, గ్రామర్‌ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.

కాలపరిమితి: మే 10 నుంచి జూన్‌ 8 వరకు, వేళలు: సాయంత్రం 5.30–7.30
తరగతులు: సాక్షి జర్నలిజం స్కూల్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్, హైదరాబాద్‌
కోర్సు ఫీజు: రూ. 4,600, రిజిస్ట్రేషన్ల కోసం: సాక్షి టవర్స్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లేదా sakshiedge@gmail.comను సంప్రదించవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement