'అదితి' కోసం ప్రత్యేక బృందాలు | special teams for adithi says narayana | Sakshi
Sakshi News home page

'అదితి' కోసం ప్రత్యేక బృందాలు

Sep 25 2015 3:07 PM | Updated on Sep 3 2017 9:58 AM

'అదితి' కోసం ప్రత్యేక బృందాలు

'అదితి' కోసం ప్రత్యేక బృందాలు

ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్: ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి అదితి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై  మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు.  గల్లంతైన అదితి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ జిల్లా సీతమ్మధారలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్.అండ్ బి ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అదితి (6) గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కనే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి ఆ చిన్నారి అందులో పడి కొట్టుకుపోయింది. జీవీఎంసీ నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement