కూలిన భారీ హోర్డింగ్... సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి | Software engineer killed at hitech city in Hyderabad | Sakshi
Sakshi News home page

కూలిన భారీ హోర్డింగ్... సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి

Oct 12 2014 1:57 PM | Updated on Oct 22 2018 7:50 PM

కూలిన భారీ హోర్డింగ్... సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి - Sakshi

కూలిన భారీ హోర్డింగ్... సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మరో నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మరో నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. హైటెక్ సిటీ సమీపంలోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే వ్యక్తిపై భారీ హోర్డింగ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పృధ్వీ అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

మృతుడి వద్ద దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్రామ్గూడలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు కూకట్పల్లి నివాసి అని... అతడి బంధువులకు సమాచారం అందజేసినట్లు చెప్పారు. హోర్డింగ్ ఏర్పాటులో లోపం కారణంగానే కూలిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేశారు.  మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో గత వారం హిమాయత్ నగర్ లోని తెరిచిఉంచిన మ్యాన్ హోల్ పడి ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement