ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా

ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా - Sakshi


హైదరాబాద్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆమె తరఫు న్యాయవాది రెహానా అన్నారు.  భర్త అనిల్, అత్తమామలపై ఆమె 2014లో గృహహింస చట్టం కింద  కేసు పెట్టిన విషయం తెలిసిందే. సారిక తరఫున న్యాయవాది రెహానా వాదిస్తున్నారు.


 


సారిక అనుమానాస్పద మృతిపై రెహానా గురువారమిక్కడ మాట్లాడుతూ 'పనిమనిషిగా చూస్తున్నారని సారిక నాకు చాలాసార్లు చెప్పింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది. అనిల్-సనా అక్రమ సంబంధం గురించి చెప్తూ బాధపడింది. నెల రోజుల క్రితం సారిక నాతో ఫోన్‌లో మాట్లాడింది. 15 రోజుల క్రితం వచ్చి వ్యక్తిగతంగా కలిసింది. చివరిసారి కలిసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైనా న్యాయం చేయాలని విలపించింది. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కంట్యాక్స్‌లో చూపించారు' అని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top