బీజేపీతో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌: షబ్బీర్‌ | Shabbir Ali on Muslims Reservations | Sakshi
Sakshi News home page

బీజేపీతో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌: షబ్బీర్‌

Apr 16 2017 3:06 AM | Updated on Mar 29 2019 9:00 PM

బీజేపీతో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌: షబ్బీర్‌ - Sakshi

బీజేపీతో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌: షబ్బీర్‌

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌..

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌.. వాటిని వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పడం చూస్తుంటే బీజేపీ–టీఆర్‌ఎస్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్టనిపిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలని డిమాండ్‌ చేశారు. వెంకయ్యనాయుడు వీటిని మతపరమైన రిజర్వేషన్లు అనడం సరికాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కాకుండా కేంద్రమంత్రిగా మాట్లాడితే మంచిదన్నారు. తెలంగాణ.. పాకిస్తాన్‌ అవుతుందంటూ వెంకయ్య మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ ఓ బచ్చా అని, కాంగ్రెస్‌ను విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మడమేనని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement