సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు | Seemandhra doctors should go back, says telangana doctors | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు

Aug 5 2014 12:58 PM | Updated on Sep 6 2018 3:01 PM

సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు - Sakshi

సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మంగళవారం గాంధీలో తెలంగాణ-సీమాంధ్ర వైద్యుల మధ్య రగడ నెలకొంది.

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మంగళవారం గాంధీలో తెలంగాణ-సీమాంధ్ర వైద్యుల మధ్య రగడ నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులను హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు ఇరుప్రాంతాల వైద్యుల మధ్య వివాదానికి దారి తీసాంది.

రాష్ట్రం విభజించినందువల్ల 'మీరు మీ స్వస్థలాలకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్లగలరని, తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తప్పవని' వాల్ పోస్టర్లో హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రి, మెడిక్ల కళాశాల్లో సుమారు 300 మంది ప్రొఫెసర్లు, అసోషియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తుండగా వారిలో 60శాతం మంది వైద్యులు సీమాంధ్రకు  చెందినవారే. కాగా తమపై దాడులు చేశారంటూ తెలంగాణ వైద్యులు సూపరిండెంటెంట్ ఫిర్యాదు చేశారు. సీమాంధ్ర డాక్టర్లు విధులకు హాజరు కావటం లేదంటూ తెలిపారు. కాగా ఇరు ప్రాంతాల వైద్యుల మధ్య ఏర్పడ్డ వివాదంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement