రామలింగరాజుకు బెయిల్ మంజూరు | satyam computers scam:ramalinga raju got bail | Sakshi
Sakshi News home page

రామలింగరాజుకు బెయిల్ మంజూరు

May 11 2015 5:49 PM | Updated on Sep 3 2017 1:51 AM

రామలింగరాజుకు బెయిల్ మంజూరు

రామలింగరాజుకు బెయిల్ మంజూరు

రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్ : రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష చొప్పున, మిగతా నిందితులు రూ.50 వేలు పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ  ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని  ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement