నవభారత నిర్మాణానికి నడుంబిగించాలి | 'Sakshi' editorial director Ramchandra Murthy call to the youth | Sakshi
Sakshi News home page

నవభారత నిర్మాణానికి నడుంబిగించాలి

Sep 10 2017 3:22 AM | Updated on Sep 19 2017 1:35 PM

నవభారత నిర్మాణానికి  నడుంబిగించాలి

నవభారత నిర్మాణానికి నడుంబిగించాలి

భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి పిలుపునిచ్చారు.

యువతకు ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి పిలుపు
సాక్షి, హైదరాబాద్‌: నవభారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. శనివారం గీతం విశ్వవిద్యాలయంలో ప్రజాసంబంధాల నూతన విద్యార్థి విభాగాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పొరుగువాడి గురించి పట్టించుకునేవారే కరువయ్యారని, దీంతో ఆత్మన్యూనతకు లో నైన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిని మార్చగలిగే శక్తి యువత లోనే ఉందని, వారు మంచి సమాజాన్ని స్వప్నించి దాని సాకారానికి కృషి చేయాలని అన్నారు.

రచయితలు, మేధావులు, సంఘ సేవకులను తరచూ విశ్వవిద్యాలయా నికి ఆహ్వానించి ముఖాముఖి నిర్వహించాలని, తద్వారా మనచుట్టూ ఉన్న ప్రపంచంపై విద్యార్థులకు విశాలమైన భావన ఏర్పడుతుందని అన్నారు. గీతం రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, జీహెచ్‌బీఎస్‌ డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వై.లక్ష్మణ్‌కుమార్, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ జీఏ రామారావు తదితరులు రామచంద్రమూర్తిని సత్కరించి పండ్లు, మొక్కను అందజేశారు.  గీతం పీఆర్‌ అండ్‌ మీడియా సెల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతకంతో కూడిన శుభాభినందన సందేశం రావడం విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement