సాక్షి ఎడ్జ్‌ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ | Sakshi Edge training for Spoken English | Sakshi
Sakshi News home page

సాక్షి ఎడ్జ్‌ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ

May 24 2017 2:32 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి ఎడ్జ్‌ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ - Sakshi

సాక్షి ఎడ్జ్‌ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ

ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి.

సాక్షి, హైదరాబాద్‌: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ ఆధ్వర్యంలోని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్‌’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్‌ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.

కాలపరిమితి:    జూన్‌ 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు
వేళలు:    సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు
తరగతులు:    షైన్‌ హైస్కూల్‌ (పాత విజ్ఞాన్‌ హైస్కూల్‌), హరిత హోటల్‌
    ఎదురుగా, నక్కలగుట్ట, హన్మకొండ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరుగుతాయి
కోర్సు ఫీజు:    రూ. 3,900
రిజిస్ట్రేషన్ల కోసం:    సాక్షి సిటీ కార్యాలయం, అడ్వొకేట్స్‌ కాలనీ–1,
    విమెన్స్‌ డిగ్రీ కాలేజీ దగ్గర, హన్మకొండలో సంప్రదించాలి.
వివరాలకు:    ఫోన్‌ నంబర్లు 9603533300, 9505514424
    (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
    లేదా  sakshiedge@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement