ఎంసెట్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | RTC special buses for eamcet 2016 | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

May 13 2016 5:46 PM | Updated on Sep 4 2017 12:02 AM

ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్: ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ జేఎండీ రమణారావు తెలిపారు. ఆదివారం జరిగే ఈ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,538 బస్సులు అందుబాటులో ఉంచనున్నట్లు రమణారావు పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ 1,063, వరంగల్‌లో 105, నిజామాబాద్‌లో 90, మెదక్‌లో 130, మహబూబ్‌నగర్‌లో 35 బస్సులను నడుపుతామని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement