ఆప్కోకు రూ.58.32 కోట్ల రుణం | Rs 58.32 crore loan to APCO | Sakshi
Sakshi News home page

ఆప్కోకు రూ.58.32 కోట్ల రుణం

Mar 28 2016 11:17 PM | Updated on Mar 28 2019 5:39 PM

ఆప్కాబ్(ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్) నుంచి ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సహకార సంస్థ) తీసుకున్న రూ.58.32 కోట్లకు పూచీకత్తు ఇచ్చేందుకు సర్కారు సోమవారం అంగీకారం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: ఆప్కాబ్(ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్) నుంచి ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సహకార సంస్థ) తీసుకున్న రూ.58.32 కోట్లకు పూచీకత్తు ఇచ్చేందుకు సర్కారు సోమవారం అంగీకారం తెలిపింది.

వస్త్రాల కొనుగోలుకు రూ.52.48 కోట్లు, ముడిసరుకులు కొనుగోలుకు రూ.5.84 కోట్లు వెరసి రూ.58.32 కోట్లను ఆప్కాబ్ నుంచి రుణం తీసుకోవడానికి పూచీకత్తు ఇవ్వాలని జౌళి శాఖ కమిషనర్ పి.నరేష్ ఫిబ్రవరి 29న పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు తీసుకున్న రుణానికి ప్రభుత్వం పూచీ కత్తు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement