గోదాములో అగ్నిప్రమాదం: రూ. 40 లక్షల ఆస్తి నష్టం | Rs. 40 Lakhs loss in fire accident in kattedan | Sakshi
Sakshi News home page

గోదాములో అగ్నిప్రమాదం: రూ. 40 లక్షల ఆస్తి నష్టం

May 22 2015 11:51 AM | Updated on Sep 5 2018 9:45 PM

నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్, టాటానగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పరిశ్రమ గోదాములో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ : నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్, టాటానగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పరిశ్రమ గోదాములో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంజయ్‌గోయెల్ అనే వ్యక్తికి చెందిన అల్యూమినియం, బ్లీచింగ్ తయారీ పరిశ్రమలలో ఎండ వేడిమికి సరుకు వేడిగా మారడంతో పాటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

దీంతో అగ్నికీలకు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో గోదాములోని సరుకు, సామాగ్రి కాలి బూడిదైంది. సుమార్ రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement