breaking news
kattedan
-
కాటేదాన్లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
హైదరాబాద్: కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని తాతానగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు భారీగా ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ కాటేదాన్లో SOT పోలీసుల దాడి
-
గోదాములో అగ్నిప్రమాదం: రూ. 40 లక్షల ఆస్తి నష్టం
హైదరాబాద్ : నగర శివారు మైలార్దేవ్పల్లి డివిజన్, టాటానగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పరిశ్రమ గోదాములో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంజయ్గోయెల్ అనే వ్యక్తికి చెందిన అల్యూమినియం, బ్లీచింగ్ తయారీ పరిశ్రమలలో ఎండ వేడిమికి సరుకు వేడిగా మారడంతో పాటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో అగ్నికీలకు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో గోదాములోని సరుకు, సామాగ్రి కాలి బూడిదైంది. సుమార్ రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.