రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం | Rs. 1 crore worth ganja seized | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

Jul 21 2017 4:44 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.

హైదరాబాద్: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నానక్‌రాం గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోకి వస్తున్న వెర్నా కారును ఎస్‌వోటీ పోలీసులు ఆపి సోదా చేశారు. అందులో రూ.కోటి విలువైన గంజాయి దొరికింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement