'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు' | rk roja suspension cancelld and women mla's happy on the verdict | Sakshi
Sakshi News home page

'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు'

Mar 17 2016 11:13 AM | Updated on Aug 31 2018 8:24 PM

'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు' - Sakshi

'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు'

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి ఈ అంశంపై మాట్లాడారు. వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిదని.. రోజా అసెంబ్లీకి వచ్చి, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తిస్తారని కల్పన అన్నారు. ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ సస్పెన్షన్లకు జడిసి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామని అనుకుంటారేమో, జడిసేది లేదని, పోరాడుతూనే ఉంటామని తెలిపారు. రోజా కూడా పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తారని, అంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా చూస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడమేనని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దారుణంగా రోజాను కేవలం అధికార పార్టీని నిలదీసినందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. ఈ కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.

టీడీపీ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోగా, మహిళా ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసింది.. చివరకు ధర్మమే గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతున్న విషయాలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించినా, అటునుంచి మంత్రులకు బదులు అనిత లేచి మాట్లాడతారని తెలిపారు. రోజా విషయంలో మేం గర్వపడుతున్నాం. ఆమెలాంటి ధైర్యవంతురాలు మా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement