టాప్ రే! | results of the second Inter | Sakshi
Sakshi News home page

టాప్ రే!

Apr 27 2015 11:43 PM | Updated on Sep 3 2017 12:59 AM

టాప్ రే!

టాప్ రే!

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లోనూ జంట జిల్లాల విద్యార్థులు జయభేరి మోగించారు.

ద్వితీయ ఇంటర్ ఫలితాల్లోనూ రంగారెడ్డిదే అగ్రస్థానం
రెండో స్థానంలో మళ్లీ హైదరాబాదే ఈసారీ బాలికలదే హవా

 
సిటీబ్యూరో:  ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లోనూ జంట జిల్లాల విద్యార్థులు జయభేరి మోగించారు. మొదటి సంవత్సర ఫలితాల మాదిరిగానే విజయ పరంపర కొనసాగించారు. సోమవారం విడుదలైన ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

రంగారెడ్డి జిల్లాలో 75 శాతం, హైదరాబాద్ జిల్లాలో 64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా రెండు జిల్లాల్లోనూ బాలికలే అధిక మార్కులు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement