స్కూలు పిల్లల కోసమే రిసార్టు.. | Resort for school children | Sakshi
Sakshi News home page

స్కూలు పిల్లల కోసమే రిసార్టు..

Jun 24 2017 12:18 AM | Updated on Sep 5 2017 2:18 PM

గిరాయిపల్లి అడవుల్లో కట్టిన రిసార్టు కేవలం స్కూలు పిల్లల ఎక్స్‌కర్షన్‌ కోసమేనని, ఇందులో ఎలాంటి అటవీ జంతువుల

‘కోటలో వేటగాడు’ కథనంపై గిరాయిపల్లి రిసార్టు ఎండీ
 
సాక్షి, హైదరాబాద్‌: గిరాయిపల్లి అడవుల్లో కట్టిన రిసార్టు కేవలం స్కూలు పిల్లల ఎక్స్‌కర్షన్‌ కోసమేనని, ఇందులో ఎలాంటి అటవీ జంతువుల వేట ఈవెంటు జరగడంలేదని రిసార్టు ఎండీ ప్రేమానంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘కోటలో వేటగాడు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఖండించారు. ఇందులో పాఠశాల విద్యార్థులను ఆకర్షించే ట్రీ టాప్‌ వాకింగ్, స్వింగింగ్‌ బ్రిడ్జ్, ట్రంపోలైన్, కమాండో నెట్‌ తదితర ఆటలు ఉంటాయని పేర్కొన్నారు.

రిసార్టు పరిసరాలు పూర్తిగా సీసీ కెమెరాలతో అనుసంధానం చేశామని వివరించారు. తమ రిసార్టు ప్రాంగణంలో రెండు కొండ గొర్రెలు దొరికాయని, అందులో ఒకటి తీవ్రంగా గాయపడి ఉండగా, మరోటి చిన్నపిల్ల అని వివరించారు. వీటికి చికిత్స చేయటం కోసం పర్యాటకులకు దూరంగా ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేసి అందులో ఉంచినట్లు తెలిపారు. గతవారం ఫారెస్టు అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement