‘అసైన్డ్‌’ చట్ట సవరణ!

Regulation of SC ST Poor Assigned Lands - Sakshi

ఎస్సీ, ఎస్టీ, పేదల అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ

ధనికుల భూముల్ని క్రమబద్ధీకరించం: మహమూద్‌ అలీ

హెచ్‌ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణ ఉండదు

ఇక స్కూళ్లలో తెలుగు తప్పనిసరి

ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర అసెంబ్లీ శనివారం ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో అసైన్డ్‌ భూముల చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తెలుగును తప్పనిసరి చేసే బిల్లు, డీజీపీ ఎంపిక, నియామకం బిల్లు, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్ట సవరణ బిల్లు, న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి సవరణ బిల్లు, మెడికల్‌ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి.

దళితులు, పేదల అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ
దళితులు, గిరిజనులు, పేదలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసైన్డ్‌ భూములు(మార్పిడి నిషేధం) చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ శాసనసభలో ప్రవేశపెట్టారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, పేదలు కొనుగోలు చేసిన 2.5 ఎకరాల వరకు ఆరుతడి, 5 ఎకరాల వరకు మెట్ట భూములను మాత్రమే క్రమబద్ధీకరిం చేందుకు ఈ బిల్లును తెచ్చామని తెలిపారు.

ధనికులు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూముల ను క్రమబద్ధీ కరించమని, హెచ్‌ఎండీఏ పరిధి లోని అసెన్డ్‌ భూములను సైతం క్రమబద్ధీకరిం చబోమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20,13,863 ఎకరాల అసైన్డ్‌ భూములుంటే అందులో 2,41,126 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయ న్నారు. ఈ వివాదాలను పరిష్కరించడం కోసమే ఈ బిల్లును తెచ్చామన్నారు. హైదరా బాద్‌తో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించేందుకే ప్రభుత్వం ఈ బిల్లు తెస్తోందని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు.

నిర్బంధ వైద్య సేవలు అక్కర్లేదు
మెడికల్‌ ప్రాక్టీషనర్లుగా రిజిస్ట్రేషన్‌ పొందేం దుకు ఎంబీబీఎస్, పీజీ వైద్యులు తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో నిర్బంధ వైద్య సేవలు అందించాలనే నిబంధ నను తొలగిస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్బంధ వైద్యుల సేవలు అవసరం లేదన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీజీ వైద్య విద్య సీట్లను 250కు పైగా పెంచామన్నారు. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో డీఎన్‌బీ కోర్సులు ప్రారంభించనున్నామన్నారు. రెగ్యులర్‌ ప్రాతిపదికన అన్ని వైద్య విభాగాల్లో 2,673 స్పెషలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య పెరుగుతుందని, అందువల్లే చట్టానికి సవరణలు చేస్తున్నామన్నారు.

న్యాయవాదులు, గుమస్తాల స్టాంపు విలువ పెంపు
తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, తెలంగాణ న్యాయవాదులు, గుమస్తాల సంక్షేమ నిధి చట్టాలకు సంబంధించిన రెండు వేర్వేరు సవరణæ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. న్యాయవాదులు, గుమస్తాల సంక్షేమ నిధి స్టాంపుల విలువను రూ.50 నుంచి రూ.100కు పెంచుతూ ఈ సవరణలను చేపట్టినట్టు న్యాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

పలు శాఖల పద్దులకు ఆమోదం
రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ, అడవులు, పర్యావరణ, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక, ప్రభుత్వ రంగ సంస్థల, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి శాఖల వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించింది.

అన్ని బడుల్లో తెలుగు తప్పనిసరి
రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఇతర భాషా పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి అమలు చేయాలనే ఉద్దేశంతో బిల్లును తెచ్చామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు, రాష్ట్ర, కేంద్ర, ఇతర భాషా ప్రాథమిక స్కూళ్లలో మొదటి తరగతిలో తెలుగు భాషను ప్రవేశపెడుతు న్నామన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తెలుగు భాషను ప్రవేశపెడ తామన్నారు. సిలబస్‌ రూపకల్పన బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు యూనివర్సిటీలకు అప్పగించామన్నారు.

రాష్ట్రం పరిధిలోనే డీజీపీ నియామకం
డీజీపీ ఎంపిక, నియామకం కోసం రాష్ట్రాలు సొంత చట్టం తయారుచేసుకునే వరకు.. యూపీపీఎస్సీ సిఫారసు చేసిన ముగ్గురు అధికారుల్లో ఒకరిని డీజీపీగా నియమించుకోవాలని 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు డీజీపీ నియామకానికి సంబంధించి సొంత చట్టాలు రూపొందించుకున్నాయని, ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకొస్తున్నామన్నారు. ఇకపై డీజీపీ నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ అంశం వస్తుందన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top