భారత్‌లోనూ జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు.
జికాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్
May 29 2017 12:12 PM | Updated on Sep 5 2017 12:17 PM
హైదరాబాద్: భారత్‌లోనూ జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బాపూనగర్‌కు చెందిన ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించిన విషయం విదితమే. బాధితుల్లో ఇద్దరు గర్భిణులు ఇటీవలే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చారని గుజరాత్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.
Advertisement


