TG: నేడు భారీవర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ | Heavy rains in the state; red alert for several districts | Sakshi
Sakshi News home page

TG: నేడు భారీవర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌

Jun 14 2026 9:45 AM | Updated on Jun 14 2026 12:12 PM

Heavy rains in the state; red alert for several districts

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో  అలర్ట్‌లు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి,  మేడ్చల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

అదేవిధంగా సిద్ధిపేట, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా వర్షాలు పడే అవకాలున్నాయని పేర్కొది. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. 

ఎల్లో అలర్ట్‌- సాధారణం కంటే ఎక్కువ వర్షాలు (6.45 సెం.మీ నుండి 11.55 సెం.మీ వరకు) కురిసే అవకాశం ఉన్నప్పుడు, లేదా వాతావరణం ప్రతికూలంగా మారినప్పుడు ఈ అలర్ట్ జారీ చేస్తోంది.

రెడ్ అలర్ట్- అత్యున్నత స్థాయి ప్రమాదం అని అర్థం.తీవ్రత: అత్యంత భారీ వర్షాలు (24 గంటల్లో 20.45 సెం.మీ కంటే ఎక్కువ) కురిసి, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు ఈ హెచ్చరికను జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement