తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం | Rains in Telugu States likely | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం

Jun 8 2016 10:54 AM | Updated on Sep 4 2018 5:02 PM

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ : విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. నైరుతి రుతుపవనాలు నేటి సాయంత్రం లేదా గురువారం ఉదయం కేరళను తాకనున్నాయని పేర్కొంది.

మరో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రానున్నాయని చెప్పసింది. తెలంగాణలో వాతావరణం చల్లబడిందని... అలాగే పలుచోట్ల చిరుజల్లులు పడే అవకాశం కుడా ఉందని పేర్కంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement