బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి | r. krishnaih request to k.laxman for bc reservation | Sakshi
Sakshi News home page

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

May 7 2016 4:25 AM | Updated on Sep 3 2017 11:32 PM

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు బీసీ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేతలు లక్ష్మణ్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా చట్టం చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు. జనాభాలో 50%కి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేస్తామని లక్ష్మణ్ వారికి హామీనిచ్చారు. లక్ష్మణ్‌ను కలసిన వారిలో ఆర్.కృష్ణయ్యతోపాటు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్, కుందారపు గణేశాచారి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement