హైదరాబాద్‌లో అత్యధికం.. ‘జయశంకర్’లో అత్యల్పం | Population of District lowest Shankar district | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అత్యధికం.. ‘జయశంకర్’లో అత్యల్పం

Sep 16 2016 6:06 AM | Updated on Sep 18 2018 7:56 PM

కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో అత్యధిక జనాభా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఈ జిల్లా జనాభా 39,43,323 కాగా...

సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో అత్యధిక జనాభా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఈ జిల్లా జనాభా 39,43,323 కాగా... 2, 3 స్థానాల్లో మల్కాజిగిరి (24,40,073), శంషాబాద్ (20,51, 130) నిలవనున్నాయి. 6,54,853 మందితో అతి తక్కువ జనాభా ఉండే జిల్లాగా జయశంకర్ జిల్లా నిలవనుంది. పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఉండే జనాభా వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం జనాభా 3,50,50,137 కాగా.. అందులో దళితులు 54,18,263 (15 శాతం), ఎస్టీలు 32,00,280 (9 శాతం), మైనారిటీలు 48,35,639 (14 శాతం) మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధిక జనాభా ఉన్నా దళితులు, గిరిజనుల శాతం ఇతర అన్ని జిల్లాల కన్నా తక్కువగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement