‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’ | Ponguleti Sudhakar Reddy Comments on Rahul Gandhi Attack | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’

Sep 27 2016 2:47 AM | Updated on Sep 4 2017 3:05 PM

‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’

‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన దాడిని ప్రతిపక్ష నేత కె.జానా రెడ్డి, శాసనమండలిలో...

సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన దాడిని ప్రతిపక్ష నేత కె.జానా రెడ్డి, శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. రాహుల్‌పై దాడి సిగ్గుచేటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. దాడులకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీతాపూర్‌లో గాడ్సేకు గుడి కట్టారని, రాహుల్‌పై దాడికి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే కారణం కావచ్చని పొంగులేటి ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement