చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు | police fired on chain snachers at hyderabad | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు

Nov 2 2015 11:45 AM | Updated on Oct 2 2018 2:30 PM

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు - Sakshi

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు

సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు.

హైదరాబాద్: చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలుపరుస్తున్నారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ రాజధాని హోటల్  వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

బైక్ పై దూసుకొచ్చిన దుండగులు.. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు విఫలయత్నం చేసి పారిపోతుండగా యాంటీ స్నాచింగ్ టీమ్ సిబ్బంది వారిని వెంబడించారు. వాహనం ఆపాలని హెచ్చరించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రివాల్వర్ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. చివరికి దుండగులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. తుపాకి చప్పుడుతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement