breaking news
hayath nager police station
-
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు
హైదరాబాద్: చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలుపరుస్తున్నారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ రాజధాని హోటల్ వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బైక్ పై దూసుకొచ్చిన దుండగులు.. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు విఫలయత్నం చేసి పారిపోతుండగా యాంటీ స్నాచింగ్ టీమ్ సిబ్బంది వారిని వెంబడించారు. వాహనం ఆపాలని హెచ్చరించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రివాల్వర్ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. చివరికి దుండగులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. తుపాకి చప్పుడుతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.