జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు.. | police arrested tho, who murderded a minor in bahadurpura | Sakshi
Sakshi News home page

జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు..

Dec 4 2015 11:27 PM | Updated on Aug 25 2018 6:21 PM

జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు.. - Sakshi

జైలుకు పంపాడని 13 పోట్లు పొడిచాడు..

జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడంటూ ఓ బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేవారు.

హైదరాబాద్: జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడంటూ ఓ బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేవారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం..

కాలాపత్తర్‌కు చెందిన జావేద్ (22)లు చైన్ స్నాచింగ్ తోపాటు ఇతర కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చారు. అతడికి జైలు శిక్ష పడేందుకు శాస్త్రిపురం ఓవైసీహిల్స్ ప్రాంతానికి చెందిన షాబాద్ (17) సాక్ష్యం ఉపకరించింది. నిజానికి షాబాద్ కూడా చిన్నపాటి నేరస్తుడే. గత నెలలో పోలీసులు నగరంలోని నేరగాళ్ల వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టారు. ఆసమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో షాబాద్.. జావేద్ దగ్గర ఆశ్రయం పొందాడు. ఎప్పటినుంచో షాబాద్ పై కక్ష పెట్టుకున్న జావెద్.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇజముల్లా (19)తో కలిసి షాబాద్‌ను బైక్‌పై మీరాలం ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు.

షాబాద్‌ను ఇజముల్లా పట్టుకోగా... జావేద్ కత్తితో గొంతుపై పొడిచాడు. జైలుకు పంపాడన్న పగతో షాబాద్ కడుపు, ఛాతీలపై 13 సార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నవంబర్ 29వ తేదీన ఉదయం అటుగా వచ్చిన వారు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేయగా మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జావేద్‌పై హుస్సేనీఆలం, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్‌లో స్నాచింగ్, తదితర కేసులున్నాయి. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement