స్థలాల కొనుగోళ్లు వాణిజ్యం కిందకు రాదు | Sakshi
Sakshi News home page

స్థలాల కొనుగోళ్లు వాణిజ్యం కిందకు రాదు

Published Tue, May 22 2018 1:24 AM

Places purchases do not come under trade

సాక్షి, హైదరాబాద్‌: భూముల్ని ప్లాట్లుగా చేసి ఒప్పం దం ప్రకారం వినియోగదారుడికి స్థలాన్ని ఇవ్వకపోతే తీసుకున్న సొమ్మును వడ్డీతో చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు చెప్పింది. స్థలాల కొనుగోలు వాణిజ్యం పరిధిలోకి రాదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ బీఎన్‌ రావు నల్లా, సభ్యుడు జస్టిస్‌ పాటిల్‌ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.

రంగారెడ్డి జిల్లా విజయవాడ జాతీయ రహదారిలో ప్రిస్టేజ్‌ అవెన్యూ లిమిటెడ్‌కు చెందిన ఓషన్‌ ప్రిస్టేజ్‌ ప్రాజెక్టులో వెయ్యి గజాల స్థలం కోసం రుచిత అనే మహిళ 2007లో రూ.4.25 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అది ప్రభుత్వ భూమి కావడంతో సంస్థ స్థలాన్ని అప్పగించలేకపోయింది. చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వలేదు.

దాంతో రుచిత వేసిన కేసులో రూ.4.25 లక్షలకు వడ్డీగా రూ.3.82 లక్షలు, పరిహారంగా రూ.ఒక లక్ష చెల్లించాలని జిల్లా ఫోరం చెప్పింది. దీనిని ప్రిస్టేజ్‌ ప్రాజెక్టు ఏజెంట్‌ సీహెచ్‌ కృష్ణయ్య రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో సవాల్‌ చేశారు. వాణిజ్య అవసరాలతోనే ప్లాట్‌పై పెట్టుబడి పెట్టారని, లాభం కోసమే పెట్టుబడి పెట్టా రనే అప్పీల్‌ వాదనను కమిషన్‌ తోసిపుచ్చింది.

Advertisement
Advertisement