ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం | physiotherapy doctor raped by software engineer | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం

Oct 14 2015 6:26 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం - Sakshi

ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం

చికిత్స చేసేందుకు ఇంటికి వచ్చిన మహిళా ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజినీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: చికిత్స చేసేందుకు ఇంటికి వచ్చిన మహిళా ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజినీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో ఈ దారుణం జరిగింది.

మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చాడని, ఆ తర్వాత లైంగిక దాడి చేశాడని చెప్పింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్కు చెందినవారు కాగా, నిందితుడు మనోజ్ రాజస్థాన్కు చెందినవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మనోజ్ పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement