పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది | Password protected school kid from Kidnaper | Sakshi
Sakshi News home page

పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది

Jul 31 2014 1:57 PM | Updated on Sep 15 2018 5:14 PM

పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది - Sakshi

పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది

న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని కిడ్నాప్ చేయడానికి దుండగుడు చేసిన ప్రయత్నాలను ఓ చిన్నారి తిప్పికొట్టింది.

స్కూల్ పిల్లలు కిడ్నాప్ గురికావడం తరచు వార్తల్లో వింటుంటాం. చూస్తుంటాం. న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని కిడ్నాప్ చేయడానికి దుండగుడు చేసిన ప్రయత్నాలను ఓ చిన్నారి తిప్పికొట్టింది. 
 
వివరాల్లోకి వెళితే.. అర్జెంట్ మీ అమ్మ తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఓ దుండగుడు దేశ రాజధానిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఎనిమిదేళ్ల పాపను కిడ్నాప్ కు ప్రయత్నించారు. అయితే కిడ్నాపర్ పై అనుమానం వచ్చిన ఆ చిన్నారి అందుకు సమాధానంగా పాస్ వర్డ్ చెప్పమని అడిగిందట. దాంతో కంగారుపడిన కిడ్నాపర్ అక్కడి నుంచి జారుకున్నారట. 
 
ఇంతకు అసలు విషయమేమింటంటే.. కిడ్నాపర్ల నుంచి బారిన పడకుండా తల్లి, కూతుళ్లు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకున్నారట. ఏ పరిస్థితిల్లోనూ ఎవరైనా తనతో రమ్మని అడిగితే పాస్ వర్డ్ చెప్పాలని కూతురుకు తల్లి చెప్పిందట. తల్లి, కూతుర్ల మధ్య పాస్ వర్డ్ ఓ ప్రమాదం నుంచి తప్పించింది. 
 
ఏమైనా కిడ్నాపర్ చిక్కుకుండా తీసుకున్న తల్లి జాగ్రత్తను ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం ఓ లేఖను ప్రకటన రూపంలో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీసులను, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను నిందించకుండా తల్లి తండ్రులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. అందరికి మంచిదే కదా....

Advertisement
 
Advertisement
Advertisement