నొప్పుల నూనె తాగిన చిన్నారి | Pains Oil Drunked the kid and died | Sakshi
Sakshi News home page

నొప్పుల నూనె తాగిన చిన్నారి

Jun 4 2016 3:37 AM | Updated on Mar 23 2019 7:54 PM

నొప్పుల నూనె తాగిన చిన్నారి - Sakshi

నొప్పుల నూనె తాగిన చిన్నారి

శీతల పానీయం అనుకుని కోకాకోలా బాటిల్‌లో ఉన్న ఒంటి నొప్పుల ఆయుర్వేద నూనె తాగిన ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు.

చికిత్స పొందుతూ మృతి
 
 హైదరాబాద్: శీతల పానీయం అనుకుని కోకాకోలా బాటిల్‌లో ఉన్న ఒంటి నొప్పుల ఆయుర్వేద నూనె తాగిన ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి... కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతపాలెంకు చెందిన కారు డ్రైవర్ పి.శ్రీనివాస్ తన ఇద్దరు భార్యలతో నగరంలోని జవహర్‌నగర్‌లో నివాసముంటున్నాడు.

మొదటి భార్య ఆదమ్మ ఆధార్ కార్డు కోసం గురువారం సొంత గ్రామానికి వెళ్లగా, రెండో భార్య కవిత తన ఐదేళ్ల కుమారుడు నవీన్‌తో కలసి ఇంటి వద్దే ఉంది. ఆదమ్మ ఒంటి నొప్పుల కోసం తెచ్చుకున్న ఆయుర్వేద నూనెను కోకాకోలా బాటిల్‌లో పోసివుంచింది. అందుబాటులో ఉన్న ఆ బాటిల్‌ను చూసిన నవీన్ దాన్ని కూల్‌డ్రింక్ అనుకుని తాగాడు. నువ్వు కూడా తాగంటూ... బాటిల్‌ను తల్లికీ ఇచ్చాడు. కంగుతిన్న తల్లి... వెంటనే అతడిని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ నవీన్ శుక్రవారం మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement