కేసీఆర్పై భగ్గుమన్న ఓయూ విద్యార్థులు | osmania students set afire effigy of kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై భగ్గుమన్న ఓయూ విద్యార్థులు

Mar 10 2014 1:12 PM | Updated on Aug 15 2018 9:17 PM

కేసీఆర్పై భగ్గుమన్న ఓయూ విద్యార్థులు - Sakshi

కేసీఆర్పై భగ్గుమన్న ఓయూ విద్యార్థులు

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు భగ్గుమన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు భగ్గుమన్నారు. కేసీఆర్ మాటలకు నిరసనగా విద్యార్థులు ఉస్మానియా వర్సిటీలో ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎంసీసీ గేట్‌ వరకు నిరసన ర్యాలీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే ఇక కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని, తాము నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement