సభ వాయిదా వేసినా అసెంబ్లీలోనే విపక్షాలు | opposition protest against farmer suicidesfarmer suicides issue | Sakshi
Sakshi News home page

సభ వాయిదా వేసినా అసెంబ్లీలోనే విపక్షాలు

Sep 30 2015 9:29 PM | Updated on Oct 1 2018 2:36 PM

సభ వాయిదా వేసినా అసెంబ్లీలోనే విపక్షాలు - Sakshi

సభ వాయిదా వేసినా అసెంబ్లీలోనే విపక్షాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. అయితే, శాసనసభను రేపటికి వాయిదా వేసినప్పటికీ.. విపక్షాల నేతలు సభలోనే బైఠాయించారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. అయితే, శాసనసభను రేపటికి వాయిదా వేసినప్పటికీ.. విపక్షాల నేతలు సభలోనే బైఠాయించారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లేది లేదంటూ వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు అసెంబ్లీలోనే బైఠాయించారు. బుధవారం రోజు కూడా సమావేశాలు కొద్ది వాడివేడిగా జరిగాయి.

రైతుల రుణమాఫీ అంశంపై ప్రతిపక్షాలు అధికార పక్షంపై పదేపదే ప్రశ్నలు కురిపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశాయి.  ఒకే దఫాలో రైతుల రుణమాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, లెఫ్ట్ పార్టీల నేతలు సభలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement