నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు తెరచి.. | Open a fake Facebook accounts | Sakshi
Sakshi News home page

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు తెరచి..

Nov 30 2014 1:03 AM | Updated on Jul 26 2018 5:21 PM

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు తెరచి.. - Sakshi

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు తెరచి..

నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు.

ఉద్యోగి అరెస్ట్
 
సిటీబ్యూరో: నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరానికి పాల్పడి  పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం మేరకు.. నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన కె.రవికుమార్ (44) నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ యూనియన్‌లో ఆధిపత్య పోరు నెలకొనడంతో తన ప్రాబల్యం తగ్గిందని, ఇద్దరు మహిళా ఉద్యోగులపై కక్ష కట్టాడు. హెల్త్ కార్డుల కోసం అక్కడి ఉద్యోగులు పాస్‌పోర్టు ఫొటోలను రవికుమార్‌కు ఇచ్చారు.

అందులో ఆ ఇద్దరు మహిళల ఫొటోలతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను తెరిచి, అసభ్యకర దృశ్యాలు, వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు సైబర్‌క్రైమ్ అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఆశిష్‌రెడ్డి నిందితుడిని గుర్తించి శనివారం అరె స్టు చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement