రాచకొండ కమిషనరేట్ పరిధిలోనిమహిళా పోలీసుల సిబ్బందికి కొరియన్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోనిమహిళా పోలీసుల సిబ్బందికి కొరియన్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని 175 మందికి బుధవారం హప్కిడో అనే యుద్ధ విద్యను నేర్పారు. హోంగార్డు నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు ఇందులో పాల్గొన్నట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేష్ ఎం భగవత్ తెలిపారు.
తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందిన సినీనటి ఇషాకొప్పికర్, ఆమె మాస్టర్ సర్దార్ ఎండీ షేక్‌తో కలిసి ఈ శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా పోలీసులకు ఆత్మరక్షణ మెలకువలతోపాటు విధి నిర్వహణలో భాగంగా నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్పినట్లు ఆయన తలిపారు. నేరగాళ్లను పట్టుకోవటం, చైన్ స్నాచర్లు, ఈవ్ టీజర్లు వంటి నిందితులను అరెస్టు చేయటానికి హప్కిడో విశేషంగా ఉపయోగపడుతుందని కమిషనర్ వివరించారు. ఒక పోలీసు అధికారి విధి నిర్వహణలో విజయవంతం కావటానికి ముందుగా ఆత్మరక్షణ చాలా కీలకమైన అంశమని భగవత్ తెలిపారు.