నకిలీ పత్రాలతో వీసాకు యత్నం..ఒకరి అరెస్టు | One arrested for fake documents | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో వీసాకు యత్నం..ఒకరి అరెస్టు

Aug 18 2016 7:59 PM | Updated on Oct 3 2018 6:52 PM

నకిలీ పత్రాలతో అమెరికాకు వెళ్లేందుకు వీసాలకు యత్నించిన ఓ వ్యక్తిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ పత్రాలతో అమెరికాకు వెళ్లేందుకు వీసాలకు యత్నించిన ఓ వ్యక్తిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. కే రళ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్(32) అమెరికాకు విజిటింగ్ వీసాపై వెళ్లేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో హైదరబాద్ శామీర్‌పేట్‌లోని డూపాంట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వీసా కోసం అమెరికన్ కాన్సులేట్‌లో పత్రాలను దాఖలు చేశారు. అయితే, కాన్సులేట్ అధికారులు వెరిఫికేషన్‌లో భాగంగా డూపాంట్ కంపెనీని సంప్రదించగా అవి తాము జారీ చేయలేదని తెలిపారు. ప్రశాంత్ అనే వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడంలేదని చెప్పారు. దీంతో అమెరికన్ కాన్సులేట్ అధికారులు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్‌ను గురువారం అరెస్టు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement