బుల్లి అతిథికో గూడు.. | nets for birds Animal Rehabilitation and Protection Front | Sakshi
Sakshi News home page

బుల్లి అతిథికో గూడు..

Mar 13 2016 2:24 AM | Updated on Sep 3 2017 7:35 PM

బుల్లి అతిథికో గూడు..

బుల్లి అతిథికో గూడు..

పక్షులకు ఆపద్బాంధవుడిగా ఉంటూ వాటిని కాపాడేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది సిటీకి చెందిన యానిమల్ రీహాబిలిటేషన్ అండ్ ప్రొటక్షన్ ఫ్రంట్ (ఏఆర్‌పీఎఫ్).

 పక్షులకు ఆపద్బాంధవుడిగా ఉంటూ వాటిని కాపాడేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది సిటీకి చెందిన యానిమల్ రీహాబిలిటేషన్ అండ్ ప్రొటక్షన్ ఫ్రంట్ (ఏఆర్‌పీఎఫ్). ఇందులో భాగంగా జంతు సంరక్షణపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. పిచ్చుకల కోసం స్వయంగా గూడును తయారు చేసుకొనేలా చెక్క ముక్కలతో బర్డ్ నెస్ట్ తయారీపై బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. పక్షి ప్రేమికులు ఈ వర్క్‌షాప్‌లో భాగం పంచుకున్నారు. ఈ గూడులను గ్రిల్‌కి, కిటికీకి, ఇంటి దగ్గరి చెట్ల కొమ్మలకి.. ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. 

 పిల్లలనూ భాగస్వాముల్ని చేయాలి..
సిటీలో పెరుగుతున్న కాలుష్యంతో ఇక్కడ పక్షులు జీవించడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పిచ్చుకలు అంతరించిపోతాయి.  పిల్లలకు పక్షులపై ప్రేమ పెంచాలి. మా పాపని ఈ వర్క్‌షాప్‌లో భాగం చేశాను. ఇక నుంచి తనే ఎంచక్కా పక్షి గూళ్లను తయారు చేసి ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకుంటుంది.                                                       - ప్రసన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement