ముంబయి మోడల్స్తోపాటు యువకులు అరెస్ట్ | Mumbai models arrested for dancing by madhapur police | Sakshi
Sakshi News home page

ముంబయి మోడల్స్తోపాటు యువకులు అరెస్ట్

Feb 6 2016 11:18 PM | Updated on Sep 3 2017 5:04 PM

ముంబయి మోడల్స్తోపాటు యువకులు అరెస్ట్

ముంబయి మోడల్స్తోపాటు యువకులు అరెస్ట్

నగరంలోని మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్లో ముజ్రాపార్టీపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడి చేశారు.

హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్లో ముజ్రాపార్టీపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ సందర్భంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మద్యం, నగదును పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పట్టుబడిన వారిలో ముంబయికి చెందిన నలుగురు మోడల్స్తోపాటు 17 మంది యువకులు ఉన్నారని... వారిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement