సాక్షి,న్యూఢిల్లీ: వ్యాపారంలో గిరాకీ పెరగాలంటే కేవలం నాణ్యత ఉంటే సరిపోదు.. ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు కూడా ఉండాలంటూ ఓ ప్రాంతానికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి నిరూపించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయన చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఒక కూరగాయల దుకాణంలో ఉల్లిపాయలు, బంగాళాదుంపల బస్తాల మధ్య ఓ యువతి హిందీ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటు యజమాని కూడా స్టెప్పులు వేశారు. కూరగాయల షాపులో ఈ లైవ్ డ్యాన్స్ షోను చూసేందుకు జనం ఎగబడ్డారు. చుట్టూ భారీగా గుమికూడి విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. కేవలం డ్యాన్స్ చూసి వెళ్లిపోకుండా, అక్కడికక్కడే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కొనుగోలు చేయడంతో వ్యాపారికి ఒక్కసారిగా కాసుల వర్షం కురిసింది.
ఈ 30 సెకన్ల వినూత్న మార్కెటింగ్ స్టంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ 'దేశీ జుగాడ్' ట్రిక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యాపారి తెలివితేటలను కొందరు అప్రిషియేట్ చేస్తుంటే, మరికొందరు ఇలాంటి పద్ధతులు ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కారణం ఏదైనా ఈ క్రేజీ ఐడియా మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే, షాపు ఎక్కడ, యజమాని వివరాలు వెలుగులోకి రాలేదు.
learn marketing pic.twitter.com/YvfRq6DI67
— Jack (@jackusa35) August 22, 2026


