మృగవని’కి మహర్దశ | 'Mrgavani' will be in the national parkudasa | Sakshi
Sakshi News home page

మృగవని’కి మహర్దశ

Aug 17 2013 1:59 AM | Updated on Oct 4 2018 6:10 PM

‘మృగవని’ జాతీయ పార్కు దశ మారబోతోంది. త్వరలో కొత్త అందాలను సంతరించుకోనుంది. ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయనున్నారు.

మొయినాబాద్, న్యూస్‌లైన్: ‘మృగవని’ జాతీయ పార్కు దశ మారబోతోంది. త్వరలో కొత్త అందాలను సంతరించుకోనుంది. ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయనున్నారు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న చిలుకూరు ‘మృగవని’ జాతీయ పార్కు ఇకపై లక్ష్మీ జ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యం లో మరిన్ని వసతులతో కొత్త హంగులు దిద్దనున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీఓ సైతం జారీ చేసింది. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 700 ఎకరా ల్లో ‘మృగవని’ జాతీయ పార్కు ఏర్పాటైంది. నగరానికి చేరువలో ఉండటంతోపాటు గండిపేట, హిమాయత్‌సాగర్ జం ట జలాశయాలకు మధ్యలో ఉండటంతో పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లక్ష్మీజ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

 పర్యాటక కేంద్రంగా...
 మృగవని పార్కు నగరానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే నగరం,  ఇతర ప్రాంతాల నుంచీ ప్రజలు సం దర్శించే అవకాశం ఉంటుంది. మండలంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది.

 రిసార్ట్, హోటల్ నిర్మాణం...
 ‘మృగవని’ అభివృద్ధిలో భాగంగా పార్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో రిసార్ట్, హోటల్ నిర్మాణం చేపట్టారు. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగెకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు మరో మూడు నెలల్లో పూర్తికానున్నాయి. ఇందులో పర్యాటకులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 పెరగనున్న చార్జీలు..
 పార్కు ప్రవేశ రుసుము రూ.5 నుంచి రూ.10కి పెరగనుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.5 వసూలు చేస్తారు. సఫారీ  చార్జీ ఒక్కొక్కరికి రూ.5 వసూలు చేసేవారు. ఇది రూ.10 కానుం ది. నేచర్‌క్యాంప్‌నకు వచ్చే వారు రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. పార్కులోని కాటేజీల ధర సైతం పెరగనుంది. ఈ చార్జీలన్నీ వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement