కోతి బావలు చిక్కాయోచ్.. | Monkey were captured | Sakshi
Sakshi News home page

కోతి బావలు చిక్కాయోచ్..

May 10 2016 3:56 AM | Updated on Sep 3 2017 11:45 PM

నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చిన స్క్విరెల్ కోతులను సోమవారం ఉదయం జూ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు.

హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చిన స్క్విరెల్ కోతులను సోమవారం ఉదయం జూ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చిన ఈ కోతులను జూ అధికారులు రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద చెట్లపై గుర్తించారు.ఆదివారం రాత్రి చుట్టూ నె ట్‌ను ఏర్పాటు చేసి మరో చెట్టుపైకి వెళ్లకుండా కొమ్మలను నరికివేశారు.

సోమవారం ఉదయం 5 గంటలకు ఈ కోతులను పట్టుకునేందుకు యానిమల్ కీపర్లతో కలసి చర్యలు చేపట్టారు. పులుల ఎన్‌క్లోజర్ వద్దనున్న చెట్లపై నుంచి ఐనా ఎన్‌క్లోజర్ వైపు స్క్విరెల్ కోతులను తరిమివేశారు. ఐనా ఎన్‌క్లోజర్ వద్ద ఏర్పాటు చేసిన బోనులో కోతులను పట్టుకునేందుకు గుడ్లు పెట్టారు. గుడ్లను తినేందుకు కోతులు ఉదయం 8.40 గంటలకు బోనులోకి వచ్చాయి. వెంటనే సురక్షితంగా బంధించిన అధికారులు జూలోని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల్లో వీటిని సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement