
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 1న సైబర్ నేరగాళ్లు ఆయనకు ఫోన్ చేసి ఆర్‌బీఐ అధికారిని మాట్లాడుతున్నానంటూ క్రెడిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయాలని కోరారు. దీంతో సీవీవీ, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ సంఖ్యలను కూడా చెప్పేశారు. వెంటనే ఆయన కార్డునుంచి రూ.70 వేల ను ఇతర ఖాతాల్లోకి మళ్లించేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.