సికింద్రాబాద్‌లో దారుణం.. | minor girl raped and murdered in secundrabad bollaram | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో దారుణం..

Jul 3 2016 8:01 AM | Updated on Sep 4 2017 4:03 AM

సికింద్రాబాద్‌లో దారుణం..

సికింద్రాబాద్‌లో దారుణం..

అభం శుభం తెలియని ఓ చిన్నారి పై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్ బొల్లారంలోని కళాసిగూడలో జరిగింది.

హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్ బొల్లారంలోని కళాసిగూడలో జరిగింది.

స్థానికంగా నివాసముంటున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు అనిల్ అత్యాచారం చేసి హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన అనిల్ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చి అక్కడే పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అనిల్ గతంలో ఎనిమిది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. మహిళ హత్యకేసులో నిన్ననే జైలు నుంచి విడుదలైన అనిల్ తిరిగి ఈ ఘాతాకానికి ఒడిగట్టాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement