ద్రోహుల అడ్డుకట్టకే భూసేకరణ చట్టం | Sakshi
Sakshi News home page

ద్రోహుల అడ్డుకట్టకే భూసేకరణ చట్టం

Published Fri, Dec 30 2016 12:16 AM

ద్రోహుల అడ్డుకట్టకే భూసేకరణ చట్టం - Sakshi

విపక్షాలపై మండలిలో మంత్రి హరీశ్‌రావు ధ్వజం

- పెద్దల సభలో బిల్లుకు ఆమోదం
- చర్చను బహిష్కరించిన కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధికి అడ్డం పడు తున్న తెలంగాణ ద్రోహులు, అభివృద్ధి నిరోధ కులకు అడ్డుకట్ట వేసేందుకే భూసేకరణ చట్టాన్ని తేవాల్సి వచ్చిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. భూసేకరణచేసే అధికారం ప్రభు త్వానికి ఉందన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి భూమిని బలవంతంగా తీసుకోవడం లేదని,  భూ యజమానులు, జిల్లా కలెక్టర్ల పరస్పర ఒప్పందంతోనే భూసేకరణ జరుగుతోందని సభకు వివరించారు. భూసేకరణ, పునరా వాసం, పారదర్శకత హక్కు–2016 చట్ట సవరణ బిల్లుపై గురువారం శాసన మండలిలో చర్చ జరిగింది. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై స్పీకర్‌ తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదంటూ కాంగ్రెస్‌ సభ్యులు చర్చ మధ్యలోనే సభను బహిష్కరించి వాకౌట్‌ చేశారు.

పరస్పర ఒప్పందం ద్వారా 47 వేల ఎకరాలు
ఈ అంశంపై విపక్షనేత షబ్బీర్‌ అలీ, రామచందర్‌రావు, రజ్వీ, స్వపక్ష సభ్యులు పూల రవీందర్, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు అంతకుముందు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌ వివరణ ఇచ్చారు. జీవో 123 వద్దన్న వారి నుంచి 2013 భూసేకరణ చట్టం ప్రకా రమే భూములు తీసుకుంటున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఎకరాలు సేకరించగా.. అందులో పరస్పర ఒప్పందం ద్వారా 47 వేల ఎకరాలు, 2013 చట్టం ప్రకారం 13 వేల ఎకరాలు తీసుకున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. న్యాయపరమైన చిక్కులు సృష్టించి ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు  కేసులు వేశారని, అది కూడా చనిపోయిన వారి పేరుతో తప్పుడు కేసులు వేయించారన్నారు.

ప్రాజెక్టులు పూర్తయితే రెండు పంటలకు నీళ్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతుల కళ్లలో మట్టి కొట్టేందుకే కాంగ్రెస్‌ నేతలు ఇలా చేస్తున్నారని హరీశ్‌ దుయ్యబట్టారు. ప్రాజెక్టు లపై కోర్టుకు వెళ్లిన వారి చరిత్ర చూస్తే మంత్రి కేటీఆర్‌పై ఓడిపోయిన కేకే మహేందర్‌రెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిన హర్షవర్ధన్‌రెడ్డి లాంటి వాళ్లే ఉన్నారన్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి, పాదయాత్రలు చేసినా ఏ టెంటు కింద విపక్ష సభ్యులు ప్రజలను రెచ్చగొట్టారో అదే టెంటు కింద అదే ప్రజలు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందంటూ తీర్మా నం చేసి భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేసిచ్చారని వ్యాఖ్యానించారు.

కడియంకు షబ్బీర్‌ పంచ్‌
2013 భూసేకరణ చట్టం తాడూ బొంగరం లేనివాళ్లు చేసిన చట్టమంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై గురువారం మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రస్తావించారు. అయితే కేసీఆర్‌ ఉటంకించిన పదాలను ఉచ్చరించే క్రమంలో ‘తాడు..బొంగు’ లేని వారు.. అంటూ ఏదో చెప్పబోగా సభ్యులంతా ఒక్కసారిగా ఘల్లుమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ కల్పించుకొని  ‘బోంగు కాదు.. బొంగురం’ అని సవరించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం కడియం కల్పించుకొని కేసీఆర్‌ వ్యాఖ్యానించింది వ్యక్తులను ఉద్దేశించేనని.. పార్ల మెంటుపై తమకు గౌరవం ఉందన్నారు. ఈ వివరణపై షబ్బీర్‌ మండిపడ్డారు. ‘‘పార్లమెం టులో ఎంపీలు కాని వాళ్లు ఉంటారా? వాళ్లు ఏ చట్టం చేసినా పార్లమెంటు చేసినట్టే.. తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని చేసింది కూడా ఇదే ఎంపీలు. అంటే ఆ చట్టాన్ని పార్ల మెంటు చేసినట్టా..వ్యక్తులు చేసినట్టా? అని ప్రశ్నించడంతో టీఆర్‌ఎస్‌ సభ్యులు కిమ్మనలేదు.

Advertisement
Advertisement