పట్టిసీమ, పోలవరం వాటాలపై ఏం చేద్దాం? | Meet of Krishna and Godavari board chairman's with AK Bajaj Committee today | Sakshi
Sakshi News home page

పట్టిసీమ, పోలవరం వాటాలపై ఏం చేద్దాం?

Aug 2 2017 3:23 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నేపథ్యంలో..

నేడు ఢిల్లీలో ఏకే బజాజ్‌ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్‌ల భేటీ
 
సాక్షి, హైదరాబాద్‌: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నేపథ్యంలో.. ఏకే బజాజ్‌ కమిటీతో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు శ్రీవాత్సవ, హెచ్‌కే సాహూ బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మళ్లింపు జలాల వాటాలను ఎలా తేల్చాలి, ఇప్పటికే ట్రిబ్యునల్‌ చేసిన కేటా యింపులను మార్చే అధికారాలపై బోర్డు చైర్మన్‌లు బజాజ్‌ కమిటీతో చర్చించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు దక్కుతాయని, ఇం దులో భాగంగా 45 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ అంటోంది. గతేడాది ఏపీ ఏకంగా 53 టీఎంసీల మేర నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిం చుకున్నా రాష్ట్రానికి చుక్క నీటి వాటా ఇవ్వలేదు. ఈ ఏడాది సైతం మరో 28 టీఎంసీల మేర వినియోగించింది. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ ఛటర్జీ బుధ వారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో భేటీ కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement