ఏకంగా మంగళ సూత్రమే కొట్టేశారు.. | mangalasuthra theft in unknown persons | Sakshi
Sakshi News home page

ఏకంగా మంగళ సూత్రమే కొట్టేశారు..

Feb 27 2015 4:37 PM | Updated on Sep 2 2017 10:01 PM

హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ పరిధిలోని రాజనర్సింహకాలనీలో ఓ మహిళ మెడలో నుంచి ఏకంగా మంగళసూత్రమే కొట్టేశారు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ పరిధిలోని రాజనర్సింహకాలనీలో ఓ మహిళ మెడలో నుంచి ఏకంగా మంగళసూత్రమే కొట్టేశారు. వివరాలు.. రాజనర్సింహ కాలనీలో ఉంటున్న స్రవంతి, పిసల్‌బండలోని కోచ్‌వెల్ ఐడియా ఆఫ్ స్కూల్‌లో చదువుతున్న పిల్లలకు టిఫిన్ బాక్సులిచ్చి తిరిగి వస్తుండగా పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు కాపు కాచి మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారు.

ఈ సంఘటన రాజనర్సింహకాలనీలోని నేషనల్ ఫంక్షన్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగింది. బైక్ నంబరు గమనించిన ప్రత్యక్షసాక్షి ఆటో డ్రైవర్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement