జీవితంపై విరక్తి చెంది.. బాత్రూమ్‌లో.. | man suicide in bathroom | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తి చెంది.. బాత్రూమ్‌లో..

Jun 17 2016 9:58 PM | Updated on Nov 6 2018 7:56 PM

జీవితంపై విరక్తి చెంది.. బాత్రూమ్‌లో.. - Sakshi

జీవితంపై విరక్తి చెంది.. బాత్రూమ్‌లో..

జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో

నాంపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే రాజు,లక్ష్మీలు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలు కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అతడు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చి కుడికాలు, కుడి చేయి పడిపోయింది. ఇటీవల చికిత్స చేయడంతో కోలుకున్నారు. పక్షవాతం వచ్చినప్పటి నుంచి జీవితంపై రాజు విరక్తి చెందారు.

భార్య, పిల్లలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదని, అనారోగ్యంతోనే చనిపోతున్నట్లు లేఖ రాసుకుని జేబులో ఉంచుకున్నాడు. బంధువులు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement